తిరుపతి మురుగుమయం

తిరుపతిలో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇన్నాళ్లు మురుగు కాలువలు సరిగా నిర్వహించకపోవడంతో వర్షం నీరు ముందుకు సాగడంలేదు.

Published : 06 Jun 2024 06:29 IST

మురుగుమయంగా తిరుపతిలోని ఏపీఎస్‌ ఆర్టీసీ - లీలామహల్‌ మార్గం

ఈనాడు, తిరుపతి: తిరుపతిలో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇన్నాళ్లు మురుగు కాలువలు సరిగా నిర్వహించకపోవడంతో వర్షం నీరు ముందుకు సాగడంలేదు. కాలువలో పడిన నీరంతా మురుగుతో కలిసి ఒక్కసారిగా రోడ్డుపైకి చేరింది. మోకాళ్లు మునిగే వరకు వచ్చిన మురుగుతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏపీఎస్‌ ఆర్టీసీ నుంచి లీలామహల్‌ కూడలి వరకు మార్గంలో కొర్లగుంట వద్ద రహదారి పూర్తిగా మురుగుమయమైంది. శ్రీవారి భక్తులు, ప్రయాణికులు అందులోనే రాకపోకలు సాగించారు. సెంట్రల్‌ బస్టాండ్‌ వర్షం నీటితో తటాకాన్ని తలపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని