15వ అసెంబ్లీ రద్దు

రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Published : 06 Jun 2024 05:04 IST

నోటిఫికేషన్‌ జారీ చేసిన గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌నజీర్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ రద్దయింది. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌నజీర్‌ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. మంత్రి మండలి సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని 174 (2) (బి) నిబంధన ప్రకారం అసెంబ్లీని గవర్నర్‌ రద్దు చేసినట్లు ఆయన పేరిట అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు ఓ ప్రకటన జారీ చేశారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇప్పుడు 16వ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెదేపా-జనసేన-భాజపా కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయనున్న రోజు నుంచి కొత్త సభ కొలువుదీరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు