లెక్కల్లోకి రాని రెండు పోలింగ్‌ బూత్‌ల ఓట్లు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రెండు పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలు సాంకేతిక కారణాలతో తెరుచుకోలేదు.

Published : 06 Jun 2024 05:17 IST

ఈసీ మార్గదర్శకాల ప్రకారం  మెజారిటీ ప్రకటన

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో రెండు పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలు సాంకేతిక కారణాలతో తెరుచుకోలేదు. తొలుత 4వ రౌండ్‌లో బోయలపల్లె (పీఎస్‌ నం.56)కు సంబంధించిన ఈవీఎం సాంకేతిక సమస్యలతో మొరాయించింది. ఉన్నతాధికారుల సూచన మేరకు దాన్నీ పక్కనపెట్టి మిగతా వాటి లెక్కింపు కొనసాగించారు. అనంతరం 9వ రౌండ్‌లో పి.అన్నసముద్రం (పీఎస్‌ నం.765) ఈవీఎం కూడా మొరాయించడంతో దాన్ని పక్కనపెట్టి లెక్కింపు పూర్తి చేశారు. ఈ రెండు బూత్‌లు కలిపి 1,384 ఓట్లు పోలయ్యాయి. అన్ని రౌండ్లూ పూర్తయ్యేసరికి వైకాపాకు 5,477ఓట్ల ఆధిక్యం వచ్చింది. సమస్యతో నిలిచిపోయిన రెండు ఈవీఎంల ఓట్లు లెక్కించాలని తెదేపా పట్టుబట్టింది. ఈసీ నిబంధనల ప్రకారం ఓ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే లెక్కింపు జరగని ఓట్లు తక్కువగా ఉంటే ఫలితం ప్రకటించవచ్చని ఉన్నతాధికారులు ఆదేశాలివ్వడంతో ఆర్వో వెంకట సత్యనారాయణ తెదేపా అభ్యర్థితో చర్చించాక వైకాపా అభ్యర్థి గెలుపును ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని