నైరుతి ప్రభావంతో వర్షాలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా విస్తరించాయి. రాబోయే 3 లేదా 4 రోజుల్లో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated : 06 Jun 2024 05:41 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా విస్తరించాయి. రాబోయే 3 లేదా 4 రోజుల్లో కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలకు అవకాశముందని పేర్కొంది. గురువారం అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, కాకినాడ, కృష్ణా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా తిరుపతి జిల్లా తడలో 88.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని