ఉపాధ్యాయుల అక్రమ బదిలీలపై వివాదం

ఎన్నికలకు ముందు కౌన్సెలింగ్‌ విధానాలకు తిలోదకాలిచ్చి వైకాపా ప్రభుత్వం అడ్డదారుల్లో పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది.

Published : 06 Jun 2024 05:23 IST

కోడ్‌ ముగియగానే స్థానాల్లో చేరేలా సవరణ ఉత్తర్వులు

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: ఎన్నికలకు ముందు కౌన్సెలింగ్‌ విధానాలకు తిలోదకాలిచ్చి వైకాపా ప్రభుత్వం అడ్డదారుల్లో పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను బదిలీ చేయడం వివాదాస్పదమైంది. ఇప్పుడు వాటి అమలుపై సందిగ్ధత నెలకొంది. వారంతా మే 1న బదిలీ కావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్‌తో బ్రేక్‌ పడింది. మార్చి 16 నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి రాగా ఏప్రిల్‌ 12న పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బదిలీలకు సంబంధించి సవరణ ఉత్తర్వులనిచ్చారు. ఈ మేరకు కోడ్‌ ముగిసిన మరుసటి రోజే వారంతా బదిలీ స్థానాల్లో చేరాలి. వ్యక్తిగత సమస్యలు, పరస్పర అంగీకారం విధానంలో ప్రజాప్రతినిధులు, సంఘాల నేతల సిఫార్సులతో ఉత్తర్వులు పొందిన సుమారు 1400మంది ఈ జాబితాలో ఉన్నారు. 2022 నుంచి ఉపాధ్యాయుల బదిలీలపై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి దొడ్డిదారిలో ప్రత్యేక జీవోల ద్వారా బదిలీలు పొందే సంప్రదాయానికి తెరతీశారు. ఒక్కో బదిలీ కోసం రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మామూళ్లు ముట్టజెప్పినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి, మార్చిలలో పాఠశాల విద్యాశాఖ ఏడు మెమోలనిచ్చింది. వాటిని అనుసరించి ఈ నెల 7న బదిలీ అయిన స్థానాల్లో వారంతా విధుల్లో చేరాల్సి ఉండగా.. ఈ విషయమై ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు తెదేపా నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని