ఆసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థులకు తప్పని అవస్థలు

డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కింద ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందించేందుకు వెళుతున్న పీజీ వైద్య విద్యార్థులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కనీస వసతులను కల్పించడం లేదు.

Updated : 06 Jun 2024 06:09 IST

ఈనాడు, అమరావతి: డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం కింద ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలందించేందుకు వెళుతున్న పీజీ వైద్య విద్యార్థులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కనీస వసతులను కల్పించడం లేదు. పీజీ రెండో సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా 3 నెలలపాటు డీఆర్‌పీ కింద వైద్య ఆరోగ్యశాఖ కేటాయించిన ఆసుపత్రుల్లో పనిచేయాలి. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు 2023-24 విద్యాసంవత్సరం నుంచి తమకు కేటాయించిన తేదీల్లో ఆసుపత్రులకు వెళుతున్నారు. వారి కళాశాలలు, విధి నిర్వహణకు కేటాయిస్తున్న ఆసుపత్రులు దూరంగా ఉంటుండటంతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. భోజన వసతి, బస సదుపాయాలూ కల్పించడం లేదు. మరోవైపు శాశ్వత స్పెషాలిటీ వైద్యుల పర్యవేక్షణలో పనిచేసేందుకు అదే స్పెషాలిటీకి చెందిన పీజీ వైద్య విద్యార్థులను ఆసుపత్రులకు పంపాలి. ఈ నియమాన్ని చాలాచోట్ల పాటించడం లేదు. జాతీయ వైద్య కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం విధులకు వెళుతున్న తమకు అందుకు తగ్గట్టు కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఎలాగని జూనియర్‌ వైద్యుల సంఘం వైద్య ఆరోగ్య శాఖను ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు