వీసాకు వరుస కట్టారు..!

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇటీవల ఆ దేశం వీసా స్లాట్లను విడుదల చేసింది.

Updated : 07 Jun 2024 06:43 IST

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇటీవల ఆ దేశం వీసా స్లాట్లను విడుదల చేసింది. దీంతో  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి నిత్యం వెయ్యి నుంచి 1,200 మంది విద్యార్థులు వీసా ఇంటర్వ్యూల కోసం తరలి వస్తున్నారు. వారితో పాటు వారి తల్లిదండ్రులు, బంధువుల రాకతో హైదరాబాద్‌  నానక్‌రాంగూడలో ఉన్న కాన్సులేట్‌ కార్యాలయ ప్రాంగణం సందడిగా మారింది.    

ఈనాడు, హైదరాబాద్‌


గోదావరిపై జీవన చిత్రం

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ప్రముఖ చిత్రకారుడి కుంచె నుంచి జాలు వారిందనుకుంటే పొరబడినట్లే. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామ సమీప గోదావరి నదిలోకి జాలరులు  పడవలో చేపల వేట కోసం వెళ్తున్నారు. వేట కోసం పడవలో వెళ్తుండగా ఈ దృశ్యం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.    

ఈనాడు, హనుమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని