నృసింహస్వామికి లోకేశ్‌ దంపతుల పూజలు

మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామిని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు.

Published : 07 Jun 2024 06:17 IST

నారా లోకేశ్‌ దంపతులను ఆశీర్వదిస్తున్న ప్రధాన అర్చకుడు శ్రీనివాస దీక్షితులు

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామిని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ అన్నపురెడ్డి కోటిరెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. లోకేశ్‌ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో స్వామికి పూజలు చేశారు. వారికి అర్చకులు వేదాశీర్వచనం, సహాయ కమిషనర్‌ స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని