ఏయూలో సంబరాలు

‘గత ఐదేళ్లలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన చూశాం. తెలుగుదేశం కూటమి గెలవడంతో రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు.

Published : 07 Jun 2024 05:33 IST

ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌

ఏయూలో కేక్‌ కోస్తున్న ఆచార్య జాన్‌

విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్‌టుడే : ‘గత ఐదేళ్లలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన చూశాం. తెలుగుదేశం కూటమి గెలవడంతో రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)లో రాజ్యాంగ ఉల్లంఘనలు చేసిన వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలి. దొడ్డిదారిన రిజిస్ట్రార్‌ అయిన ఆచార్య ఎం.జేమ్స్‌ స్టీఫెన్‌ను తొలగించాలి’ అంటూ ఏయూ పరిపాలనా భవనం ఎదుట పలువురు ఆచార్యులు, విశ్రాంత ఆచార్యులు, పరిశోధకులు, పూర్వ విద్యార్థులు గురువారం డిమాండు చేశారు. కూటమి ఘన విజయం నేపథ్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. విశ్రాంత ఆచార్యులు జాన్‌ మాట్లాడుతూ ఏయూలో వీసీ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. కొన్నింటిపై హైకోర్టులో వ్యాజ్యం కూడా వేశామని, గవర్నర్‌ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ప్రసాదరెడ్డిని తొలగించి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగి జగన్నాథ నాయుడు డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని