విజయనగరం ప్రభుత్వాసుపత్రి పేరు మార్పు

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పేరు మారింది. గురువారం రాత్రి తెదేపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకొని భవనం బోర్డుపై ఉన్న ‘సర్వజన’ అక్షరాలను తొలగించి మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి అని మార్చారు.

Published : 07 Jun 2024 05:37 IST

పాత పేరును తొలగిస్తున్న తెదేపా నాయకులు 

మహారాజ ప్రభుత్వ ఆసుపత్రిగా ఏర్పాటు చేసిన బోర్డు

విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పేరు మారింది. గురువారం రాత్రి తెదేపాకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకొని భవనం బోర్డుపై ఉన్న ‘సర్వజన’ అక్షరాలను తొలగించి మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి అని మార్చారు. గతంలో మహారాజ జిల్లా ఆసుపత్రి అని ఉండగా వైకాపా ప్రభుత్వం 2022 అక్టోబర్‌లో ఆ పేరును తొలగించి, సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చిన విషయం విదితమే.

న్యూస్‌టుడే, విజయనగరం వైద్యవిభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని