ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలతో గవర్నర్‌కు జాబితా

సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా నేతృత్వంలోని అధికారుల బృందం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అందజేసింది.

Published : 07 Jun 2024 06:18 IST

సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల వివరాలను గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అందజేస్తున్న సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనా ఆధ్వర్యంలోని ఎన్నికల అధికారులు

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల వివరాలతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా నేతృత్వంలోని అధికారుల బృందం గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు అందజేసింది. గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసిన వారిలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్, అదనపు సీఈఓలు కోటేశ్వరరావు, ఎం.ఎన్‌ హరేంధిర ప్రసాద్, సెక్రటరీ సంజయ్‌కుమార్, జాయింట్‌ సీఈఓ ఎ.వెంకటేశ్వరరావు, సెక్షన్‌ ఆఫీసర్‌ రవీందర్‌ తదితరులు ఉన్నారు.

ఎన్నికల కోడ్‌ ఎత్తివేత: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సాయంత్రం 6 గంటలతో కోడ్‌ ముగిసినట్లేనని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని