జగన్‌ కార్యాలయ సిబ్బంది..మాతృశాఖలకు

ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ కార్యాలయంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అదనపు కార్యదర్శి, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, సహాయ కార్యదర్శులను మాతృశాఖలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.

Published : 07 Jun 2024 05:39 IST

పులివెందుల క్యాంపు కార్యాలయంలోని సిబ్బంది కూడా.. 

ఈనాడు, అమరావతి: ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ కార్యాలయంలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అదనపు కార్యదర్శి, కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, సహాయ కార్యదర్శులను మాతృశాఖలకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ముఖ్య సలహాదారులు, సలహాదారుల వద్ద పనిచేసే వారితో పాటు ఫిర్యాదుల పరిష్కార విభాగం, పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పనిచేసే పలువురు సిబ్బందిని కూడా ఆదేశించింది. వెంటనే అక్కడ నుంచి రిలీవ్‌ చేయాలని, వారంలో రిపోర్టు చేయాలని పేర్కొంటూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సీఎంఓలో వివిధ స్థాయిల కార్యదర్శుల వద్ద ఓఎస్‌డీ, పర్సనల్‌ అసిస్టెంట్, సెక్రటరీలుగా పనిచేసే బయటి వ్యక్తుల్ని విధుల నుంచి తొలగిస్తూ మరో ఉత్తర్వు కూడా ఇచ్చారు. సీఎం కార్యదర్శి దగ్గర ఓఎస్‌డీగా పనిచేసే టీవీఎస్‌జీ కుమార్, సీఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్ద ఎఎస్‌డీగా పనిచేసే పద్మావతిని వెంటనే రిలీవ్‌ చేస్తున్నట్లు ఇంకొక ఉత్తర్వు సైతం జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని