రిలీవ్‌ చేయం.. కొనసాగాల్సిందే

మాతృశాఖకు పంపాలని కోరుతూ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది.

Published : 07 Jun 2024 05:40 IST

విజయ్‌కుమార్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డిలకు ప్రభుత్వం ఆదేశం

ఈనాడు, అమరావతి: మాతృశాఖకు పంపాలని కోరుతూ సమాచార పౌరసంబంధాలశాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఆయన మరో రెండేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని గతంలో కోరారు. దీనిపై నిర్ణయం వెలువడలేదు. ఎన్నికల్లో ఇప్పుడు వైకాపా ఓటమిపాలై, కూటమి గెలవడంతో తనను విధుల నుంచి రిలీవ్‌ చేయాలని కోరారు. అయితే ప్రభుత్వం ఆయన వినతిని తిరస్కరించింది. 

  • కేంద్ర ఆర్థికశాఖలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అధికారి చిలకల రాజేశ్వరరెడ్డిని మాతృశాఖకు పంపిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా.. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుని కొనసాగుతున్నారు. ఆయన్ను మాతృశాఖకు పంపిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని