అంతలోనే ఎంత మార్పు!.. కూటమి గెలుపుతో సీఆర్డీఏకి కనువిప్పు

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో రాజధానిలో మార్పు మొదలైంది. వైకాపా పాలనలో గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసిన సీఆర్డీఏ.

Updated : 07 Jun 2024 13:42 IST

రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో శుభ్రతా చర్యలు

ఏపీ రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో పిచ్చిమొక్కలు తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు 

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో రాజధానిలో మార్పు మొదలైంది. వైకాపా పాలనలో గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసిన సీఆర్డీఏ.. ప్రస్తుతం అత్యంత శ్రద్ధ కనబరుస్తోంది. అమరావతి నిర్మాణానికి ప్రధానిమోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో పెరిగిన పిచ్చి మొక్కలను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారిని అద్దంలా ఊడ్చి శుభ్రం చేస్తున్నారు. రహదారిపై ఉన్న విద్యుత్తు దీపాలకు మరమ్మతులు చేయిస్తున్నారు. ప్రస్తుతం శంకుస్థాపన ప్రాంతంలో సెక్యూరిటీని ఏర్పాటుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని