ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు పునరుద్ధరించాలి

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలని కొత్త ప్రభుత్వానికి బోధనేతర ఉద్యోగుల సంఘం గురువారం లేఖ రాసింది.

Published : 07 Jun 2024 05:52 IST

ప్రభుత్వానికి వర్సిటీ బోధనేతర సిబ్బంది లేఖ

ఈనాడు, అమరావతి: విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ పేరును పునరుద్ధరించాలని కొత్త ప్రభుత్వానికి బోధనేతర ఉద్యోగుల సంఘం గురువారం లేఖ రాసింది. దేశంలోనే తొలి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో 1986 నవంబరు 1న ఎన్టీఆర్‌ హయాంలో నెలకొల్పారని సంఘం గౌరవ అధ్యక్షుడు కర్రి నరసింహారావు గుర్తుచేశారు. దీనికి 1999లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్‌ పేరు పెట్టగా, దాన్ని గత ప్రభుత్వం తొలగించి వైఎస్సార్‌ పేరు తగిలించడం సరికాదన్నారు. 38 ఏళ్లుగా ఆటుపోట్లు లేకుండా సాగిన వర్సిటీకి గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని విస్మరించిందని వాపోయారు. ఈ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. వర్సిటీకి చెందిన రూ.400 కోట్లను రాబట్టుకోవడం సహా పలు విషయాలపై త్వరలోనే ప్రభుత్వాన్ని కలిసి వివరిస్తామని నరసింహారావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని