తప్పు చేస్తే చట్టపరిధిలోనే సమాధానమిద్దాం

అరాచకమే వైకాపా విధానమని.. వారికి కేసులంటే భయం లేదు, చట్టమంటే విలువ లేదని మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికైన వల్లభనేని బాలశౌరి ధ్వజమెత్తారు.

Published : 07 Jun 2024 05:55 IST

భౌతిక దాడులకు పాల్పడొద్దని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు
మచిలీపట్నం ఎంపీగా ఎన్నికైన బాలశౌరి వ్యాఖ్యలు

పరిమళ్‌ నత్వానితో బాలశౌరి 

ఈనాడు, అమరావతి: అరాచకమే వైకాపా విధానమని.. వారికి కేసులంటే భయం లేదు, చట్టమంటే విలువ లేదని మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికైన వల్లభనేని బాలశౌరి ధ్వజమెత్తారు. వైకాపా నేతలు, కార్యకర్తలు తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించాలి తప్ప.. జన సైనికులు ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని సూచించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పలు దఫాలుగా ఈ విషయాన్ని చెప్పారని ఆయన వివరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కేసుల్లో ఇరుక్కుంటారని.. తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో బాలశౌరి పేర్కొన్నారు. వైకాపా అరాచకాలకు చట్టపరిధిలోనే సమాధానం చెప్పాలని.. ఎక్కడైనా తప్పులు చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

బాలశౌరితో పరిమళ్‌ నత్వాని భేటీ

రాజ్యసభ సభ్యుడు పరిమళ్‌ నత్వాని గురువారం దిల్లీలో బాలశౌరితో భేటీ అయ్యారు. జనసేన పార్టీ తరపున మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికైన బాలశౌరికి అభినందనలు తెలియజేసినట్లు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రాష్ట్ర్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని