మాతృ శాఖలకు వెళ్లండి

రాష్ట్రంలో మంత్రుల వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందిని వారి మాతృ శాఖలకు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 4 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని..

Published : 07 Jun 2024 05:59 IST

మంత్రుల పేషీల్లో పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి ప్రభుత్వ ఆదేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మంత్రుల వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందిని వారి మాతృ శాఖలకు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నెల 4 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని.. వారం రోజుల్లో మాతృ శాఖల్లో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ ఆదేశించారు. వారందరూ తమ దగ్గరున్న అధికారిక దస్త్రాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలని స్పష్టం చేశారు. కార్యాలయంతోపాటు మంత్రుల ఇళ్లలోని ఫర్నిచర్, స్టేషనరీ వివరాలను నమోదు చేసి.. సంబంధిత శాఖల అధికారులకు అప్పగించి రశీదు తీసుకోవాలని సూచించారు. ‘నో డ్యూస్‌ సర్టిఫికెట్‌’ సమర్పించిన వారికి మాత్రమే మాతృశాఖకు వెళ్లేందుకు ఎల్‌పీసీలు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 21 మంది మంత్రుల వద్ద పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పేర్లతో ఉత్తర్వులిచ్చారు. మంత్రుల పేషీల్లో పనిచేసే ఓఎస్‌డీ, అదనపు పీఎస్, పర్సనల్‌ అసిస్టెంట్, అదనపు డ్రైవర్, జమేదార్, ఆఫీస్‌ సబార్డినేట్‌ సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా మరో ఉత్తర్వు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని