సలహాదారుల సేవలకు మంగళం

రాష్ట్రంలో సలహాదారుల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు, సలహాదారులు, ప్రధాన సలహాదారులను పదవుల నుంచి తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు.

Published : 07 Jun 2024 06:00 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో సలహాదారుల సేవలకు ప్రభుత్వం మంగళం పాడింది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు, సలహాదారులు, ప్రధాన సలహాదారులను పదవుల నుంచి తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులిచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రుల రాజీనామాల నేపథ్యంలో శాఖల వారీగా నియమించుకున్న సలహాదారుల సేవలను నిలిపేయాలని ఆదేశించారు. ఈ నెల 4 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. వైకాపా పాలనలో సజ్జల రామకృష్ణారెడ్డి సహా వివిధ శాఖల పరిధిలో సుమారు 40 మందికి పైగా సలహాదారులను నియమించారు. వారిచ్చిన సలహాలేమిటో తెలియదు కానీ.. జీతాలు, ఇతర రూపాల్లో ప్రతినెలా రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. ఇప్పుడు వీరందరి సేవలను నిలిపేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని