శుభాకాంక్షలు తెలిపిన వారికి ధన్యవాదాలు: పవన్‌

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు.

Published : 07 Jun 2024 06:03 IST

దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గురువారం ఉదయం కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌. చిత్రంలో పవన్‌ భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్‌

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గురువారం ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేశారు. రైతులు, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు అభినందనలు అందించారని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం శుభాకాంక్షలు తెలిపారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు