వరద కోత!

కర్నూలు జిల్లాలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి - మామిళ్లకుంట రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది.

Published : 08 Jun 2024 03:54 IST

కోతకు గురైన తుగ్గలి - మామిళ్లకుంట కోతికొండ రహదారిజ్ఞ

తుగ్గలి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి - మామిళ్లకుంట రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. దారి కోతకు గురైంది. దీంతో తుగ్గలి నుంచి కోతికొండ, మామిళ్లకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తుగ్గలి రైల్వే వంతెన వద్ద వర్షం నీరు పెద్దఎత్తున రహదారిపైకి వస్తుండటంతో గుత్తి - పత్తికొండ ప్రధాన రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని