ఉద్యోగులు, పెన్షనర్లతో పెట్టుకుంటే ఇలాగే కొట్టుకుపోతారు

ఉద్యోగులు, పెన్షనర్లను తక్కువగా అంచనా వేస్తే ఏ సర్కారైనా జగన్‌ ప్రభుత్వంలా కొట్టుకుపోవాల్సిందేనని హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు హెచ్చరించారు.

Published : 08 Jun 2024 06:05 IST

ఏపీ పెన్షనర్ల అసోసియేషన్‌

కేక్‌ కోస్తున్న జి.పూర్ణచంద్రరావు. చిత్రంలో మీరంశెట్టి, అనురాధ, రవీంద్రనాథ్‌ తదితరులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఉద్యోగులు, పెన్షనర్లను తక్కువగా అంచనా వేస్తే ఏ సర్కారైనా జగన్‌ ప్రభుత్వంలా కొట్టుకుపోవాల్సిందేనని హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ పెన్షనర్లు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడనున్న సందర్భంగా శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కేక్‌ కోశారు. అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా స్టేట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి జి.పూర్ణచంద్రరావు, అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు తదితరులు మాట్లాడుతూ.. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లు 54 లక్షల ఓటర్లను ప్రభావితం చేశారన్నారు. ఎన్నికలకు ముందే తమ డిమాండ్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్‌ సలహాదారు కేఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు గురువయ్య, ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు