శ్రీశ్రీ తనయుడు శ్రీరంగం వెంకట రమణ కన్నుమూత

మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకటరమణ (59) అనారోగ్య కారణాలతో అమెరికాలో కన్నుమూశారు. ఆయన బావమరిది గుంటూరుకు చెందిన డాక్టర్‌ రమణ యశస్వి శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు.

Published : 08 Jun 2024 06:08 IST

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకటరమణ (59) అనారోగ్య కారణాలతో అమెరికాలో కన్నుమూశారు. ఆయన బావమరిది గుంటూరుకు చెందిన డాక్టర్‌ రమణ యశస్వి శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. వెంకటరమణ భార్య మాధవి ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని గణపవరం గ్రామస్థురాలు. పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకటరమణ ఫైజర్‌ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు. వారి కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కవిత అక్కడే చదువుకుంటున్నారు. శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ ఎనభై ఏళ్ల వయసులో ఏకైక పుత్రుడు వెంకటరమణను కోల్పోవడం బాధాకరమని పలువురు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు