ఆశలకు జీవం.. అమరావతికి వైభవం!

రాష్ట్రంలో ఎన్డీయే గెలుపుతో రాజధాని అమరావతి పనుల్లో కదలిక వచ్చింది. గతంలో కనీస వసతుల కల్పనకూ ముందుకు రాని అధికారులు ఇప్పుడు ఆఘమేఘాలపై పనులు చేపట్టారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఆర్డీఏ సిబ్బంది శుక్రవారం పిచ్చి మొక్కలు తొలగించారు.

Published : 08 Jun 2024 06:15 IST

తుళ్లూరు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన భారీ వంతెన వద్ద జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తున్న సిబ్బంది

రాష్ట్రంలో ఎన్డీయే గెలుపుతో రాజధాని అమరావతి పనుల్లో కదలిక వచ్చింది. గతంలో కనీస వసతుల కల్పనకూ ముందుకు రాని అధికారులు ఇప్పుడు ఆఘమేఘాలపై పనులు చేపట్టారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సీఆర్డీఏ సిబ్బంది శుక్రవారం పిచ్చి మొక్కలు తొలగించారు. ఎండిన చెట్లు, గడ్డి తొలగించి శుభ్రం చేస్తున్నారు. తుళ్లూరు వద్ద రహదారుల వెంట జేసీబీలతో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులూ జరుగుతున్నాయి. సీడ్‌ యాక్సిస్‌ రహదారి పక్కన మొక్కలు నాటించడంతో ఇప్పుడది కళకళలాడుతోంది. రహదారిపై విద్యుత్‌ దీపాలు, సెంట్రల్‌ టవర్‌ లైటింగ్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఐదేళ్లలో ఎన్నిసార్లు అభ్యర్థించినా ఇటువైపు కన్నెత్తి చూడని అధికారులు ప్రభుత్వం మారగానే పనులు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారు.

గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంగణం వద్ద ఎండిన చెట్లను తొలగిస్తున్న సిబ్బంది

ఈనాడు, గుంటూరు; న్యూస్‌టుడే, తుళ్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని