ఎస్కేయూలో వైఎస్‌ విగ్రహం తొలగింపు

శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. వైకాపా హయాంలో విద్యార్థులు వ్యతిరేకించినా అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి వర్సిటీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.

Updated : 08 Jun 2024 06:41 IST

పాలకమండలి తీర్మానం మేరకు నిర్ణయం

రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తరలిస్తున్న విశ్వవిద్యాలయ సిబ్బంది

ఎస్కేయూ, న్యూస్‌టుడే: శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించారు. వైకాపా హయాంలో విద్యార్థులు వ్యతిరేకించినా అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి వర్సిటీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. గురువారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు, పూర్వ విద్యార్థులు ఎస్కేయూలో ఆందోళన చేశారు. వర్సిటీలో రాజకీయ నేతల విగ్రహం తొలగించాలని ఉప కులపతికి విజ్ఞప్తిచేశారు. వెంటనే తొలగించకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించారు. గురువారం సాయంత్రం పాలకమండలి సమావేశం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. వైఎస్‌ విగ్రహం తొలగించాలని సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం ఉదయం 7 గంటలకే చర్యలు చేపట్టి, పోలీసు బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని