ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌పై విచారణ జరిపించాలి

ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిపై విచారణ జరిపించాలని కోరుతూ చంద్రబాబుకు ఏపీ నిరుద్యోగుల ఫోరం అధ్యక్షుడు శ్రీరాములు శుక్రవారం లేఖ రాశారు.

Published : 08 Jun 2024 06:25 IST

చంద్రబాబుకు నిరుద్యోగుల ఫోరం అధ్యక్షుడు శ్రీరాములు లేఖ

ఈనాడు, అమరావతి: ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డిపై విచారణ జరిపించాలని కోరుతూ చంద్రబాబుకు ఏపీ నిరుద్యోగుల ఫోరం అధ్యక్షుడు శ్రీరాములు శుక్రవారం లేఖ రాశారు. ‘ఎన్నికల ఫలితాలకు ముందు కీలకమైన దస్త్రాలను హేమచంద్రారెడ్డి మాయం చేశారు. ఈయనతోపాటు ప్రత్యేక అధికారి సుధీర్‌రెడ్డి ప్రైవేటు కళాశాలల నుంచి రూ.లక్షల్లో కమీషన్లు తీసుకున్నారు. అసిస్టెంట్‌ స్పెషల్‌ అధికారి మాధవి బీఈడీ కళాశాలల అనుమతుల విషయంలో వసూళ్లకు పాల్పడ్డారు. వైస్‌ ఛైర్మన్‌ రామ్మోహనరావు, అడకమిక్‌ అధికారి శ్రీరంగం మాథ్యూలు న్యాక్‌ పర్యటనల పేరుతో స్టార్‌ హోటళ్లలో ఉంటూ రూ.25 లక్షలు ఖర్చు చేశారు. ప్రభుత్వ ఆనుమతి లేకుండానే నియామకాలు చేశారు. హేమచంద్రారెడ్డి కేపీఎంజీ ప్రాజెక్టు ముసుగులో టెండర్లు లేకుండా రూ.పది కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించారు. ఉప కులపతుల పోస్టింగుల్లో అవినీతికి పాల్పడ్డారు. కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌ పీజీ సెట్‌ కన్వీనర్‌గా ఉంటూ అడ్వాన్సుగా రూ.3 కోట్లు తీసుకున్నారు. యోగివేమన వర్సిటీలో టెండర్లు లేకుండా ఫర్నిచర్‌ కొని, దొంగ బిల్లులు పెట్టారు’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని