తెలుగు ప్రజలకు తీరని లోటు

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతిపట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రామోజీ ఫిల్మ్‌ సిటీకి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

Updated : 09 Jun 2024 08:14 IST

ప్రధాని, కేంద్ర ప్రభుత్వం తరఫున నివాళులర్పించిన నిర్మల
మోదీ సంతాప సందేశం అందజేత

రామోజీరావు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న నిర్మలా సీతారామన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మృతిపట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం రామోజీ ఫిల్మ్‌ సిటీకి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తరపున పుష్పగుచ్ఛం సమర్పించారు. అనంతరం మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు ప్రధాని సంతాప సందేశాన్ని తెలిపారు. ఈనాడు ఎండీ కిరణ్, రామోజీరావు సతీమణి రమాదేవిని ఓదార్చారు. ‘ఈరోజు చాలా బాధాకరమైనది. మరణవార్త తెలిసిన తరువాత ప్రధాని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి వచ్చాను. రామోజీరావు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. జర్నలిజం, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఆర్థిక సేవల వంటి రంగాల అభివృద్ధికి కృషి చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలు తీర్చారు. రామోజీరావు కుటుంబ సభ్యుల్ని కలిసి ప్రధాని సంతాప సందేశాన్ని తెలిపాను. రామోజీరావు సేవల గురించి ప్రధానికి బాగా తెలుసు. బుధవారం రాత్రి ప్రధాని మోదీ ఫోన్‌ చేసి రామోజీరావు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు’ అని సీతారామన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని