డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తానే

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తానే కొనసాగించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఆయన్నే డీజీపీగా కొనసాగించాలని తెదేపా భావిస్తోంది.

Published : 10 Jun 2024 04:54 IST

ఆయననే కొనసాగించాలని నిర్ణయం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా హరీష్‌కుమార్‌ గుప్తానే కొనసాగించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో కొన్నాళ్ల పాటు ఆయన్నే డీజీపీగా కొనసాగించాలని తెదేపా భావిస్తోంది. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయన మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. 2025 జులై వరకు హరీష్‌కుమార్‌ గుప్తా సర్వీసులో ఉంటారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో వైకాపాతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం.. ఆయన స్థానంలో హరీష్‌కుమార్‌ గుప్తాను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన జమ్మూకాశ్మీర్‌కి చెందిన వారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని