తెదేపాకు ఓటేశారని.. నిత్యావసరాల నిలిపివేత

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్‌ దుకాణంలో నిత్యావసరాల పంపిణీలో డీలర్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని లబ్ధిదారులు ఆదివారం దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు.

Updated : 10 Jun 2024 06:49 IST

బెస్తరపల్లిలో నిత్యావసరాల కోసం పడిగాపులు కాస్తున్న లబ్ధిదారులు

కుందుర్పి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్‌ దుకాణంలో నిత్యావసరాల పంపిణీలో డీలర్‌ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని లబ్ధిదారులు ఆదివారం దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. గ్రామంలో రెండు చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వైకాపా గ్రామ నాయకుడైన ఓ డీలర్‌ ‘వైకాపా ప్రభుత్వంలో కార్డుదారులంతా అనేక ప్రయోజనాలు పొందారు. వైకాపాకు ఓట్లు వేయకుండా పార్టీని ఓడించి మోసం చేశారు’ అంటూ లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేయలేదు. తనకు తీరిక ఉన్నప్పుడే ఇస్తానని, అప్పుడు వచ్చి తీసుకోవాలని దబాయిస్తూ తీవ్ర జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమకు నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని