సంక్షిప్త వార్తలు (9)

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు.

Updated : 10 Jun 2024 06:44 IST

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో నారాయణ సంచలనం

ఈనాడు, అమరావతి: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ వెల్లడించారు. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో సందేశ్‌ భోగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్‌దీప్‌ మిశ్రా 6, ఎం.బాలాదిత్య 11, రాఘవ్‌ శర్మ 12, బిస్మిత్‌ సాహు 16, ఆర్యన్‌ ప్రకాశ్‌ 17, అమోఘ్‌ అగర్వాల్‌ 20వ ర్యాంకులు సాధించారన్నారు. వీరితో పాటు 100లోపు 31 ర్యాంకులతో రికార్డు సృష్టించామన్నారు. వివిధ కేటగిరీలలో 6 ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకులు నారాయణవేనని వెల్లడించారు. విద్యార్థులకు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పునీత్‌ కొత్తప అభినందనలు తెలిపారు.


ఫలితాల్లో శ్రీచైతన్య సత్తా 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య యాజమాన్యం తెలిపింది. రాఘవశర్మ ఆలిండియా మొదటి ర్యాంకు, ఓపెన్‌ కేటగిరీలో రిథమ్‌ కేడియా 4వ ర్యాంకు, పుట్టి కుశాల్‌ కుమార్‌ 5, రాజదీప్‌ మిశ్రా 6, ధృవిన్‌ హేమంత్‌ దోషి 9, అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్ధ్విక్‌ సుహాస్‌ 10వ ర్యాంకులను సాధించినట్లు వెల్లడించింది. వీటితో పాటు ఓపెన్‌ కేటగిరీలో టాప్‌ 10 లోపు 5 ర్యాంకులు, 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో 100 లోపు 146, 1000 లోపు 721 ర్యాంకులు వచ్చాయని చెప్పింది. మొత్తంగా 3,728 మంది విద్యార్థులు అర్హత సాధించారని పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అభినందించారు. 


ఎస్‌ఆర్‌ విద్యార్థుల విజయకేతనం 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. అన్ని కేటగిరీలో కలిపి జి.నవీన్‌ 8వ ర్యాంకు, పి.రాకేశ్‌ కుమార్‌ 36, జె.స్నేహిత్‌ సందేశ్‌ 123, వి.రాంబాబు 125వ ర్యాంకులను సాధించారని వెల్లడించింది. వీటితో పాటు అన్ని కేటగిరీల్లో కలిపి వరుసగా 8, 36, 123, 125, 127, 133, 157, 185, 299, 323, 324, 450, 598, 621, 654, 689, 737, 751, 901, 966 వంటి మరెన్నో ర్యాంకులు సాధించిందని పేర్కొంది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అభినందించారు. 


శశి వైజాగ్‌ విజయభేరి

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో విజయభేరి మోగించామని శశి విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఆలిండియా స్థాయిలో టీఎస్‌ఎల్‌ సంజన 17వ ర్యాంకు, జి.జైదీప్‌ 223వ ర్యాంకు సాధించారని తెలిపింది. 13 మంది 2000లోపు ర్యాంకులు, 20 మంది 3000లోపు ర్యాంకులు సాధించారని పేర్కొంది. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్‌ ఛైర్మన్‌ మేకా నరేంద్రకృష్ణ, అకడమిక్‌ డైరెక్టర్‌ మేకా క్రాంతి సుధ అభినందించారు.


చరిత్ర సృష్టించిన శశి వేలివెన్ను 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు చరిత్ర సృష్టించారని శశి విద్యాసంస్థల ఛైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ తెలిపారు. పి.సత్యసాయి పవన్‌ రానా ఆలిండియా 13వ ర్యాంకు, బి.గరిమ 73, కె.సృజన్‌ 97వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. 10 మంది విద్యార్థులు 500లోపు, 20 మంది విద్యార్థులు 1000లోపు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులను శశి విద్యాసంస్థల వైస్‌ ఛైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మీ సుప్రియ అభినందించారు.


తిరుమల విద్యార్థుల ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తిరుమల ఐఐటీ, మెడికల్‌ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు వెల్లడించారు. వివిధ కేటగిరీలలో జి.ఎన్‌.వెంకట దుర్గ సాయి 53వ ర్యాంకు, కె.శరణ్‌ తేజ అనురూప్‌ రెడ్డి 62, కె.సాకేత్‌ ప్రణవ్‌ 92, హర్ష నాగ వర్ధన్‌ 95వ ర్యాంకు సాధించారన్నారు. 74 మంది విద్యార్థులు 1000లోపు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.


భాష్యం విద్యార్థుల సత్తా 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ రామకృష్ణ తెలిపారు. ఓపెన్‌ కేటగిరీల్లో సాయియశ్వంత్‌రెడ్డి ఆలిండియా 50వ ర్యాంకు, ఎం.జిష్ణుసాయి 62వ ర్యాంకు సాధించారన్నారు. వీటితో పాటు వివిధ కేటగిరీల్లో ఎం.సాయియశ్వంత్‌రెడ్డి 5, పి.గౌతమి 19, కె.శ్రేయ 23, కె.జాషువా వివేక్‌ 26, జి.జాన్‌ 36, ఎం.అర్జున్‌కుమార్‌ 37, కె.హర్షిత 43, కె.చైతన్య 52, పి.శ్యామ్‌ 61, డి.భరత్‌చంద్ర 86వ ర్యాంకు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆలిండియా 50, 62 ర్యాంకులు సాధించిన ఎం.సాయియశ్వంత్‌రెడ్డి, ఎం.జిష్ణుసాయిలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చెక్కులను భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్‌ రామకృష్ణ అందజేశారు. డైరెక్టర్‌ హనుమంతరావుతో కలిసి విద్యార్థులను అభినందించారు. 


డా.కె.కె.ఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో డా.కె.కె.ఆర్‌ గౌతమ్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు ప్రతిభ చూపారని ఆ స్కూల్‌ యాజమాన్యం తెలిపింది. ఓపెన్‌ కేటగిరీల్లో పుట్టి కుషల్‌ కుమార్‌ ఆలిండియా 5వ ర్యాంకు, సతివాడ జ్యోతిరాధిత్య 55వ ర్యాంకు సాధించారని పేర్కొంది. వీటితో పాటు 100 లోపు వివిధ కేటగిరీల్లో 3, 5, 9, 12, 17, 26, 28, 45, 55, 55, 64, 88 వంటి ర్యాంకులు 12 వచ్చాయని చెప్పింది. విద్యార్థులను స్కూల్‌ యాజమాన్యం అభినందించింది. 


ఫిట్జీ విద్యార్థుల ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో తమ సంస్థ విద్యార్థులు ప్రతిభ చూపారని ఫిట్జీ డైరెక్టర్‌ పిన్నెపు రమేష్‌ బాబు తెలిపారు. ఓపెన్‌ కేటగిరీల్లో కోడూరు తేజేశ్వర్‌ ఆలిండియా 8వ ర్యాంకు సాధించారని వెల్లడించారు. అలాగే ఈ ఫలితాల్లో దాదాపు 300 మందికి పైగా తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్‌లోనూ తమ విద్యార్థులు 100 శాతం విజయం సాధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఫిట్జీ డైరెక్టర్‌ పిన్నెపు రమేష్‌ బాబు అభినందించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు