Amaravati: గ్రహణం వీడి.. అమరావతి ధగధగలు

రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది.

Updated : 11 Jun 2024 11:09 IST

రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు 9 కిలోమీటర్ల మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈ రహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులు కనులవిందు చేశాయి. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు, అమరావతి-న్యూస్‌టుడే తుళ్లూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని