ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ బుధవారం ఖరారైంది.

Updated : 11 Jun 2024 06:19 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ బుధవారం ఖరారైంది. ఈనెల 12న ఉదయం 8.20కి ప్రధాని దిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.55కు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన కార్యక్రమం జరిగే కేసరపల్లిలోని ఐటీ పార్కు మైదానానికి వస్తారు. 11 నుంచి 12.30 గంటల వరకు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. 12.40కి అక్కడి నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు వెళ్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని