తాళాలు తెరిచే వరకు కార్యాలయాలకు రావొద్దు

గనులశాఖ సంచాలకుడి కార్యాలయం, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయాలు ఇంకా ఏపీఎస్పీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి.

Published : 11 Jun 2024 04:48 IST

గనులు, ఏపీఎండీసీ అధికారులు, సిబ్బందికి ఆదేశం

ఈనాడు-అమరావతి: గనులశాఖ సంచాలకుడి కార్యాలయం, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయాలు ఇంకా ఏపీఎస్పీ పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఈ రెండు కార్యాలయాలకు పోలీసులు తాళాలు వేసి, తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాటి తాళాలు సోమవారం కూడా తెరుచుకోలేదు. ఈ రెండింటిలో పనిచేసే అధికారులు, సిబ్బంది సోమవారం విధులకు హాజరయ్యేందుకు వెళ్లగా.. వారిని పోలీసులు కార్యాలయాల్లోకి అనుమతించలేదు. దీంతో గనులశాఖ, ఏపీఎండీసీ అధికారులు ఈ విషయాన్ని వాటి ఇన్‌ఛార్జి సంచాలకులు, ఎండీ అయిన యువరాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. 12వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, వారిచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకుందామని.. అప్పటి వరకు కార్యాలయాలకు వెళ్లొద్దని ఆయన చెప్పినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని