జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు త్వరలో టెండర్లు: సీఆర్డీఏ కమిషనర్‌ వెల్లడి

రాష్ట్రంలో ఎన్డీయే గెలుపుతో రాజధాని పనుల్లో ఊపందుకుంది. సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ సోమవారం రాజధాని అమరావతిలో రోడ్ల పక్కన జరుగుతున్న జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పరిశీలించారు.

Published : 11 Jun 2024 05:25 IST

రాయపూడిలో అధికారులకు సూచనలు ఇస్తున్న సీఆర్డీఏ కమిషనర్

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే గెలుపుతో రాజధాని పనుల్లో ఊపందుకుంది. సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ సోమవారం రాజధాని అమరావతిలో రోడ్ల పక్కన జరుగుతున్న జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పరిశీలించారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, సీఆర్డీఏ ఆధీనంలోని భూముల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. అనంతరం రాయపూడి వద్ద నిర్మించిన 10 ఎంఎల్‌డీ వాటర్‌ ట్యాంక్‌ను పరిశీలించారు. 2018లో సుమారు రూ.6 కోట్లతో భోగేశ్వరావు సంస్థ.. ట్యాంక్‌ నిర్మాణాన్ని చేపట్టింది. వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణ పనులను నిలిపి వేయడంతో ఈ ట్యాంక్‌ నిర్మాణ పనులూ నిలిచిపోయాయి.


రాయపూడి వద్ద నిర్మించిన 10 ఎంఎల్‌డీ వాటర్‌ ట్యాంక్‌

రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, వీఐటి, ఎస్‌ఆర్‌ఎం, అమృత యూనివర్సిటీలు, వివిధ విభాగాల సంస్థలకు తాగు నీటిని సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకు వచ్చిందని వివేక్‌ యాదవ్‌ తెలిపారు. దీని ద్వారా రోజుకు కోటి లీటర్ల నీటిని సుమారు 75 లక్షల మంది జనాభాకు సరఫరా చేయవచ్చన్నారు. సీడ్‌యాక్సిస్‌ రహదారితో పాటు రాజధాని ప్రాంతంలో సుమారు 2 వేలకు పైగా ఉన్న విద్యుత్తు దీపాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ కట్టా సింహాచలం, ముఖ్య ఇంజినీర్లు సీహెచ్‌ ధనుంజయ, జి.వి పళ్లంరాజు, పి.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని