Andhra news: బంగాళాఖాతంలో అల్పపీడనం

ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది.

Updated : 23 May 2024 06:13 IST

తుపానుగా మారితే ‘రెమాల్‌’గా నామకరణం
రాష్ట్రంపై ప్రభావం తక్కువే
నేడు, రేపు తేలికపాటి వర్షాలు..

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడి ఈశాన్య, వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశముందని తెలిపింది. వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి ఒమన్‌ సూచించిన ‘రెమాల్‌’ అనే పేరును పెట్టనున్నారు. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని