AB Venkateswara Rao: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీవీకి మద్దతుగా 22,559 మంది సంతకాలు

జగన్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, వేధింపులకు బలైపోయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’లో ఉద్యమం కొనసాగుతోంది.

Published : 20 May 2024 04:01 IST

న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, ప్రధాని, సీజేఐలకు విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు, వేధింపులకు బలైపోయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు మద్దతుగా ‘ఛేంజ్‌.ఓఆర్‌జీ’లో ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేస్తూ ఈ ఆన్‌లైన్‌ వేదికగా వేలమంది సంతకాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 9.30 సమయానికి ఏబీవీకి మద్దతుగా 22,559 మంది సంతకాలు చేశారు. ‘‘1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జరుగుతున్న కుటిల, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదేళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగు ఇవ్వలేదు. ఆయన పదవీవిరమణకు మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోవట్లేదు. సుదీర్ఘకాలం పాటు పోలీసుశాఖకు సేవలందించిన ఏబీవీ లాంటి ఐపీఎస్‌ అధికారికి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుండటాన్ని ప్రతిఒక్కరూ ప్రశ్నించాలి. ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అంటూ ఆయనకు మద్దతుగా ఆన్‌లైన్‌లో ఉద్యమం కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని