AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు
టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉన్నవాళ్లు నేరుగా హైకోర్టును ఆశ్రయించకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచాలని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ ఎండీని హైకోర్టు ఆదేశించింది.
ఈనాడు, అమరావతి: టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉన్నవాళ్లు నేరుగా హైకోర్టును ఆశ్రయించకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచాలని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. ఎవరు ఏమి మాట్లాడాలో చెప్పేపని కోర్టులది కాదని పేర్కొంది. బిగ్‌బాస్ షో కంటే మించిన అశ్లీలత ఉండే కంటెంట్ వివిధ వేదికల ద్వారా అందుబాటులో ఉందంది. రియాల్టీ షోపై అభ్యంతరం ఉంటే చూడొద్దని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ పి.వెంకట జోతిర్మయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. బిగ్‌బాస్‌పై నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫు న్యాయవాది కోరడంతో ధర్మాసనం... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వర్కౌట్ గ్లో’.. ఊటీలో నోరా సందడి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!