Dhoni: ఫ్యాన్సా మజాకా.. ధోనీ బర్త్‌డే.. 77 అడుగుల కటౌట్‌!

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు ధోని ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో 77 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటుచేశారు.

Updated : 07 Jul 2023 08:17 IST

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు ధోని ఫ్యాన్స్‌ ఆధ్వర్యంలో 77 అడుగుల భారీ కటౌట్‌ ఏర్పాటుచేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం అంబారుపేట ఎస్సీ కాలనీ వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఈ కటౌట్‌ ఆకట్టుకుంది. గురువారం రాత్రి ధోని అభిమానులు అంబారుపేట సత్యమ్మ తల్లి దేవాలయం నుంచి కీసర వరకు జాతీయ రహదారిపై బైకు ప్రదర్శన నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని