Tamil Nadu: ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చిన ముస్లింలు

హిందూ ముస్లిం మతసామరస్యానికి ఉదాహరణగా నిలిచిన ఘటన తమిళనాడులో జరిగింది. ఆలయ నిర్మాణానికి స్థలం లేకపోవడంతో మసీదుకు చెందిన స్థలాన్ని ముస్లింలు దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటారు.

Updated : 28 May 2024 08:50 IST

మతసామరస్యానికి సాక్ష్యంగా నిలిచిన ఘటన

సైదాపేట, న్యూస్‌టుడే: హిందూ ముస్లిం మతసామరస్యానికి ఉదాహరణగా నిలిచిన ఘటన తమిళనాడులో జరిగింది. ఆలయ నిర్మాణానికి స్థలం లేకపోవడంతో మసీదుకు చెందిన స్థలాన్ని ముస్లింలు దానంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటారు. తిరుప్పూరు జిల్లా ఓట్టపాళెయం రోస్‌గార్డెన్‌ ప్రాంతంలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ మసీదు ఉన్నప్పటికీ హిందువులకు ఆలయం లేదు. గుడి కట్టాలనుకున్నా స్థలం లేకపోవటంతో ఆ వర్గం వారు మిన్నకుండిపోయారు. ఇది తెలిసిన ఆ ప్రాంత ముస్లింలు స్థానిక మసీదుకు చెందిన 3 సెంట్ల స్థలాన్ని ఆలయ నిర్మాణానికి దానంగా ఇచ్చారు. ప్రస్తుతం గుడి పనులు పూర్తయి సోమవారం కుంభాభిషేకం జరిగింది. సారెతో కార్యక్రమానికి వచ్చిన ముస్లింలకు హిందువులు స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని