Nirabh Kumar Prasad: నూతన సీఎస్‌గా నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తితిదే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Published : 08 Jun 2024 06:27 IST

సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. తితిదే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సీఎస్‌గా నియమించినందుకు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పని చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, రజత్‌భార్గవ్, విజయానంద్, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సునీత, ప్రవీణ్‌ప్రకాశ్, ప్రద్యుమ్న, కె.శశిధర్, సత్యనారాయణ తదితరులు సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఏపీ జేఏసీ అమరావతి సంఘం, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు సైతం సీఎస్‌ను కలిసి అభినందనలు తెలిపారు.


గవర్నర్‌తో నూతన సీఎస్‌ నీరభ్‌ భేటీ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)గా శుక్రవారం నియమితులైన నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌.. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌  నజీర్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని