Cyclone: ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Published : 21 May 2024 04:56 IST

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుపానుగా బలపడిన తర్వాత ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాల వైపు పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్రానికి తుపాను ముప్పు లేదని భావిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడ్డాక మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.  మరోవైపు ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగురోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. 30 నుంచి 40 కి.మీ.వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని