Vote Counting process: కౌంటింగ్‌ రోజు 144 సెక్షన్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు రోజు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Published : 28 May 2024 04:48 IST

రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటుంది 
సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

ఏఎన్‌యూలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి జిల్లా అధికారులతో మాట్లాడుతున్న సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

గుంటూరు (ఎ.ఎన్‌.యు), న్యూస్‌టుడే: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు రోజు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ తుషార్‌ దూడిలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల దృశ్యాలను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ..‘స్ట్రాంగ్‌ రూమ్‌ల    వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశాం. సమస్యాత్మక నియోజకవర్గాలు, ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నాం.  అందుకోసం రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారు. కౌంటింగ్‌ రోజు డ్రై డే అమలు చేస్తున్నాం. పల్నాడు జిల్లాలో శాంతిభద్రతలు  అదుపులోనే ఉన్నాయి. అక్కడ పోలింగ్‌ తరువాత అల్లర్లు జరిగాయి. వెంటనే స్పందించి ప్రత్యేక బలగాలను పంపి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చాం’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు