Pawan Kalyan: మొక్కు తీర్చుకున్న పవన్‌కల్యాణ్‌

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌కల్యాణ్‌ సోమవారం దర్శించుకున్నారు.

Updated : 11 Jun 2024 06:18 IST

ప్రమాణ స్వీకారానికి ముందే నూకాలమ్మ దర్శనం

పవన్‌కల్యాణ్‌కు నూకాలమ్మ చిత్రపటం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మను జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్‌కల్యాణ్‌ సోమవారం దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నెహ్రూచౌక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాను విజయం సాధించిన వెంటనే నూకాలమ్మను దర్శించుకుంటానని, ఆ తర్వాతే పిఠాపురం వెళతానని ప్రకటించారు. ఈ క్రమంలో దిల్లీలో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌.. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకున్నారు. ఇక్కడి దేవస్థానానికి వచ్చిన ఆయనకు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయించి, మొక్కులు తీర్చుకున్నారు. పవన్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. నూకాలమ్మ దేవస్థానం మాజీ ఛైర్మన్‌ మళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

 ప్రమాణ స్వీకారానికి ముందే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అమ్మవారిని దర్శించుకుని నిబద్ధత చాటుకున్నారని అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొణతాల రామకృష్ణ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన కృషి చేస్తారని, అనకాపల్లి సభలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు