kurnool: పేరుకే పెద్దాసుపత్రి.. కరెంటు పోతే అంతే సంగతి!

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్‌ సైతం లేకపోవడంతో పలు సేవలు నిలిచిపోయాయి.

Updated : 25 May 2024 09:25 IST

ఆసుపత్రిలో విద్యుత్‌ లేక రక్తపరీక్షలు నిలిచిపోవడంతో నిరీక్షిస్తున్న మహిళలు

ఈనాడు, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్‌ సైతం లేకపోవడంతో పలు సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆయా పరీక్షల కోసం వచ్చిన రోగులు కొన్ని గంటలపాటు నిరీక్షించారు. మరికొందరు వెనుదిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ ప్రజలకు సైతం అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆసుపత్రే పెద్దదిక్కు. ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రక్తపరీక్షలు, స్కానింగ్, ఎక్స్‌రే, బ్లడ్‌ బ్యాంకు తదితర విభాగాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో.. రోగులకు సమయానికి రిపోర్టులు ఇవ్వలేకపోయారు. దీంతో వారు ఉక్కపోతతో అల్లాడిపోయారు. కొందరు గర్భిణులు రక్త పరీక్షలు చేయించుకునేందుకు రాగా.. వారి నమూనాలు తీసుకునేవారే కరవయ్యారు. ఆయా విభాగం వద్ద గర్భిణులు, తల్లులు వారి రిపోర్టుల కోసం నిలబడలేక కిందకూర్చుని ఎదురుచూడాల్సిన పరిస్థితి. సిబ్బంది చివరికి జనరేటర్‌ను అద్దెకు తెచ్చి బిగించే ప్రయత్నం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని