Ramoji Rao: అక్షర రుషికి అశ్రు నివాళి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూయడంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించారు.

Updated : 10 Jun 2024 06:28 IST

రామోజీరావు నివాసం వద్ద ప్రారంభమైన అంతిమయాత్ర

అంతిమయాత్రలో ఈనాడు ఎండీ కిరణ్‌. రామోజీరావు పార్థివ దేహాన్ని మోస్తున్న రామోజీ గ్రూపు సంస్థల హెచ్‌ఆర్‌ ప్రెసిడెంట్‌ గోపాలరావు

చితిమంటల పొగల వెనుక  కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి కన్నీటి సుడులు

రామోజీరావు మానసపుత్రిక ఈనాడు దినపత్రిక కార్యాలయం (ఫిల్మ్‌సిటీ) మీదుగా సాగుతున్న అంతిమయాత్ర

కడసారి దర్శనం చేసుకుంటున్న బంధువులు, ఉద్యోగులు, అభిమానులు. చిత్రంలో ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డి.ఎన్‌.ప్రసాద్‌

రామోజీరావుకు తుది నివాళులు అర్పించేందుకు వస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రామోజీరావుకు తుది నివాళులు అర్పిస్తున్న భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల

రామోజీరావు కుటుంబ సభ్యులు

డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి

రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న నారా బ్రాహ్మణి, భువనేశ్వరి

అంత్యక్రియలకు హాజరైన తెలంగాణ మంత్రి సీతక్క, అరికెల నర్సారెడ్డి, తెలంగాణ సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండవ వెంకటేశ్వరరావు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతలు కోనేరు కోనప్ప, మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

తుది నివాళులు అర్పించేందుకు తరలివచ్చిన ప్రముఖులు.. మల్‌రెడ్డి రంగారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, అరికెపూడి గాంధీ, మురళీమోహన్, రఘురామకృష్ణరాజు, పట్టాభి తదితరులు

అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు

నివాళులర్పిస్తున్న తెదేపా నేత లోకేశ్‌

తుది నివాళులు అర్పించేందుకు వచ్చిన తెదేపా నేత కొల్లు రవీంద్ర, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ తదితరులు

ఏపీ ప్రభుత్వం తరఫున అధికారికంగా అంత్యక్రియలకు హాజరైన ఉన్నతాధికారులు రజత్‌ భార్గవ, ఆర్‌.పి.సిసోదియా, సాయిప్రసాద్‌. వెనుక వరుసలో పోలీసు ఉన్నతాధికారిణి అంజనా సిన్హా, సిద్ధార్థ జైన్‌


జాతీయ జెండా అవనతం

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూయడంతో ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం హైకోర్టు వద్ద జాతీయ జెండాను అవనతం చేశారు. 

ఈనాడు, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని