Ramoji Rao: స్మారక నిర్మాణంలోనూ ముందుచూపు

రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

Updated : 09 Jun 2024 08:46 IST

ఫిల్మ్‌సిటీలో కట్టడం సిద్ధం చేయించిన రామోజీరావు
నేడు ప్రభుత్వ లాంఛనాలతో అక్కడే అంత్యక్రియలు

రామోజీరావు అంత్యక్రియలు జరిగే స్మృతివనం

రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రే దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి శనివారం పరిశీలించారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులకు పోలీసులు సూచించారు. 

ఈనాడు, హైదరాబాద్‌

ఏర్పాట్లను పరిశీలిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు

రామోజీరావు పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని