Vijayasai Reddy: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్..
రాజ్యసభ ప్యానల్ వైస్‌ఛైర్మన్ల జాబితా నుంచి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు.
రాజ్యసభ ప్యానల్ వైస్‌ఛైర్మన్ల జాబితాలో పేరు తొలగింపు
ఈనాడు, దిల్లీ: రాజ్యసభ ప్యానల్ వైస్‌ఛైర్మన్ల జాబితా నుంచి వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఈ నెల 5వ తేదీన మొత్తం 8 మంది పేర్లతో కూడిన ప్యానల్ వైస్‌ఛైర్మన్ల జాబితాను రాజ్యసభ విడుదల చేసింది. అందులో భువనేశ్వర్ కలితా, ఎల్.హనుమంతయ్య, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్‌రాయ్, సస్మిత్‌పాత్ర, సరోజ్‌పాండే, సురేంద్రసింగ్ నాగర్, వి.విజయసాయిరెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ అవకాశం కల్పించిన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ విజయసాయిరెడ్డి అదేరోజు జాబితాను జత చేస్తూ ట్వీట్ కూడా చేశారు. తాను సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని, సభా నిర్వహణలో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం 2.43 గంటల సమయంలో నూతన ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ ప్యానల్ వైస్‌ఛైర్మన్ల జాబితాను పునరుద్ధరించామని పేర్కొంటూ ఏడుగురి పేర్లు మాత్రమే చదివారు. విజయసాయిరెడ్డి పేరు ఆయన నోటి నుంచి రాలేదు. బుధవారం నమోదైన రాజ్యసభ రికార్డుల్లోనూ ఆ ఏడుగురి పేర్లు మాత్రమే ఉన్నాయి. అలాగే రాజ్యసభ సచివాలయం బీఏసీకి సభ్యులను ఆహ్వానిస్తూ 5వ తేదీన పంపిన నోటీసులోనూ ప్యానల్ వైస్‌ఛైర్మన్ల జాబితాలో ఏడుగురి పేర్లు తప్పితే విజయసాయిరెడ్డి పేరు కనిపించలేదు. అందులో విజయసాయిరెడ్డిని బీఏసీ సభ్యుడిగా మాత్రమే పేర్కొన్నారు. బుధవారం రాత్రి అప్‌డేట్ చేసిన రాజ్యసభ వెబ్‌సైట్‌లో ఉన్న జాబితాలోనూ ఆయన పేరు లేదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి
-
Crime News
కారులో మంటలు.. గర్భిణి, భర్త సజీవదహనం
-
Politics News
Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ
-
World News
12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!
-
Politics News
మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన