South west Monsoon: ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం

రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

Published : 28 May 2024 04:47 IST

5 రోజుల్లో కేరళను తాకనున్న ‘నైరుతి’

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్యలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా నెలవారీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరుగుతాయని అంచనా వేస్తోంది. రాబోయే ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు నైరుతి విస్తరించే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు పశ్చిమబెంగాల్‌- బంగ్లాదేశ్‌ మధ్యలో తీరం దాటిన తీవ్ర తుపాను ‘రెమాల్‌’ సోమవారం ఉదయానికి తుపానుగా బలహీనపడింది. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో ఎండ ప్రభావం అధికంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మంగళవారం 149 మండలాల్లో తీవ్ర వడగాలులు, 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని