Karnataka: కన్నడ సీమలో ‘తెలుగు’ సంబరాలు

ఏపీ శాసనసభ ఫలితాలపై బెంగళూరుతోపాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల తెలుగువారు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.

Updated : 05 Jun 2024 07:41 IST

కూటమి విజయంపై ఆనందోత్సాహాలు

ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలపై ఆనందం వ్యక్తం చేస్తున్న బెంగళూరు తెలుగుదేశం ఫోరం సభ్యులు 

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: ఏపీ శాసనసభ ఫలితాలపై బెంగళూరుతోపాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల తెలుగువారు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. పదేళ్ల కిందట ఉమ్మడి ఏపీ విభజన సమయంలో బెంగళూరులోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న తెలుగు యువకులు ‘బెంగళూరు తెలుగుదేశం ఫోరం’ ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు మద్దతుగా తమ నియోజకవర్గాల్లో జన్మభూమి కార్యక్రమాలనూ చేపట్టారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఇటీవల జైలునుంచి చంద్రబాబు విడుదలయ్యాక తన సొంత నియోజకవర్గం కుప్పం వెళుతూ బెంగళూరుకు విచ్చేసి బీటీఎఫ్‌ సభ్యుల సత్కారాన్ని అందుకున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఓటరు గుర్తింపు కార్డుకు సంబంధించి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను నిర్వహించామని ఫోరం ప్రతినిధులు సోంపల్లి శ్రీకాంత్, కనకమేడల వీరా తెలిపారు. తాము పడిన శ్రమ ఈ విజయంతో మర్చిపోయామని ఫోరం ప్రతినిధి అనిల్‌ పాణ్యం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని