YS Jagan: శక్తి ఉడిగి ఒంటరైనప్పుడే.. సింహం సింగిల్‌!

‘సింహం.. సింగిల్‌గా వస్తుంది’ అని వైకాపా నేతలు సినిమా డైలాగ్‌ వల్లెవేస్తూ వచ్చారు. ఎన్నికల్లో వైకాపా ఒంటరిగా పోటీ చేస్తోందని.. జగన్‌ను ఎదుర్కోలేక తెదేపా, జనసేన, భాజపాలు జతకట్టాయని వారు విమర్శించారు.

Updated : 05 Jun 2024 07:02 IST

ఘోర పరాజయంతో జగన్‌ పరిస్థితీ అదే 

ఈనాడు, అమరావతి: ‘సింహం.. సింగిల్‌గా వస్తుంది’ అని వైకాపా నేతలు సినిమా డైలాగ్‌ వల్లెవేస్తూ వచ్చారు. ఎన్నికల్లో వైకాపా ఒంటరిగా పోటీ చేస్తోందని.. జగన్‌ను ఎదుర్కోలేక తెదేపా, జనసేన, భాజపాలు జతకట్టాయని వారు విమర్శించారు. వాస్తవానికి సింహం సింగిల్‌గా వచ్చేదెప్పుడో తెలుసా? వేటాడే శక్తి సన్నగిల్లి ఒంటరిదైనప్పుడే. అంటే దాదాపు చావుకు దగ్గరపడినప్పుడే! ‘అడవికి రాజు సింహం. దానికి స్వయంగా వేటాడే అలవాటు ఉండదు. ఇతర జంతువులన్నీ వేటాడి తెచ్చి పెడుతుంటాయి. అది వాటిని తింటూ కూర్చుంటుంది. సింహానికి శక్తి ఉడిగిపోయాక ఇతర జంతువులు దానికి ఆహారం పెట్టడం ఆపేస్తాయి. దీంతో గతిలేక.. ఆకలితో చనిపోతుంది. ఒంటరైనప్పుడే సింహం సింగిల్‌’ అని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘మాట్లాడితే సింహం సింగిల్‌ అంటారు. ఇదేమీ జంతు ప్రపంచం కాదు’ అని ఆయన విమర్శించారు. చివరకు ఈ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం జగన్‌ను రాజకీయంగా చంపేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని