Amul milk: మరోసారి అమూల్‌ పాల ధర ₹2 పెంపు.. గుజరాత్‌ మినహా

Eenadu icon
By Business News Team Published : 15 Oct 2022 14:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమూల్‌ పాల ధరలు (Amul milk price) మరోసారి పెరిగాయి. ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) వెల్లడించింది. గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగిన ధరలు అమలవుతాయని ఫెడరేషన్‌ ఎండీ ఆర్‌ఎస్‌ సోథి తెలిపారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌ లీటర్‌ ధర రూ.61 ఉండగా.. శనివారం నుంచి దాని ధర రూ.63కు చేరింది.

అమూల్‌ పాల ధరలు పెంచడం ఈ ఏడాది వరుసగా ఇది మూడోసారి. ఆగస్టులో అన్ని రకాల పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌ ప్రకటించింది. పాల ప్యాకేజీ, రవాణా, పశుగ్రాసం వ్యయాలను కారణంగా చూపుతూ అంతకుముందు మార్చిలో సైతం పాల ధరను రూ.2 చొప్పున పెంచింది. అమూల్‌ పాల ధరల పెంపుపై ముందుగానే ప్రకటన విడుదల చేస్తుంది. కానీ ఈసారి ధర పెంచిన తర్వాత పెంపు నిర్ణయాన్ని ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు